అమెరికాలోని ఫ్లోరిడాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా కొందుర్గ్ మండలం టేకులపల్లికి చెందిన ప్రగతిరెడ్డి, ఆర్విన్, సునీత ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు…
టేకులపల్లి గ్రామానికి చెందిన మోహన్‌రెడ్డి, పవిత్రాదేవి కుమార్తె ప్రగతి రెడ్డి. ఆమెకు రోహిత్ రెడ్డితో వివాహం జరిపించారు. అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీరుగా పనిచేస్తున్న రోహిత్ రెడ్డి, ప్రగతిరెడ్డి, ఆర్విన్, రోహిత్ రెడ్డి తల్లి సునీత ప్రయాణిస్తున్న కారు ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు ప్రమాదానికి ( road accident) గురైంది. ప్రమాద ప్రాంతంలోనే ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. రోహిత్ రెడ్డి గాయాలతో చికిత్స పొందుతున్నాడు. ప్రమాద విషయం తెలియడంతో టేకులపల్లి విషాదంలో మునిగిపోయింది. మోహన్‌రెడ్డి, పవిత్రాదేవి అమెరికా పయనమయ్యారు.