అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ భూమి మీదకు వచ్చే ప్రక్రియలో ముందడుగు పడింది. గత ఏడాది జూన్ 5న అమెరికా అంతరిక్ష కేంద్రం నాసా నుంచి ఐదు రోజుల పరిశోధనలకు అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన వ్యోమగామి సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ సాంకేతిక లోపాల వల్ల 9 నెలలుగా అక్కడే చిక్కుపోయారు. ట్రంప్ ప్రభుత్వం వచ్చాక అంతరిక్షంలో చిక్కుకుపోయిన వారిని తీసుకు వచ్చేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించాయి.
స్పేస్ ఎక్స్ వ్యోమనౌక క్రూ డ్రాగన్ అంతరిక్ష కేంద్రానికి చేరుకుని డాకింగ్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసుకుంది. అమెరికా కాలమానం ప్రకారం ఇవాళ రాత్రి అన్ డాకింగ్ ప్రక్రియ పూర్తి చేయనున్నారు. మంగళవారం సాయంత్రం 4 గంటల 45 నిమిషాలకు వ్యోమనౌక భూమికి బయలు దేరుతుంది. 5 గంటల 11 నిమిషాలకు ఫ్లోరిడా సమీపంలోని సముద్ర జలాల్లో క్యాప్సూల్ దిగుతుందని, అందులో నుంచి వ్యోమగాములు బయటకు వస్తారని నాసా అధికారికంగా ప్రకటించింది.