అమరావతి రాజధానికి హౌసింగ్ అండ్ అర్భన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రుణం ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. అందుకు సంబంధించిన పత్రాలపై సీఆర్డీయే అధికారులు, హడ్కో ఎండీ కుల్‌శ్రేష్ట్ సంతకాలు చేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, పురపాలక మంత్రి నారాయణ సమక్షంలో రూ.11 వేల కోట్ల రుణ పత్రాలపై సీఆర్డీయే అధికారులు సంతకాలు చేశారు.
అమరావతి రాజధానికి అప్పు ఇచ్చేందుకు హడ్కో బోర్డు గత నెలలోనే అంగీకారం తెలిపింది. ఇప్పటికే రాజధాని నిర్మాణ పనులకు టెండర్లు పిలిచారు. వర్క్ ఆర్డర్లు కూడా ఇవ్వడంతో రేపటి నుంచి పనులు ప్రారంభం కానున్నాయి. ఇక వచ్చే నెల నుంచి బిల్లులు చెల్లించడానికి అవసరమైన నిధులను హడ్కో రుణం ద్వారా సమకూర్చుకున్నారు. అమరావతి రాజధాని ( #amaravaticapital) నిర్మాణానికి హడ్కోతోపాటు ప్రపంచ బ్యాంకు, జర్మనీకి చెందిన ఓ బ్యాంకు అప్పు ఇచ్చేందుకు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.