జమ్ము కాశ్మీర్‌లో ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతోన్న లష్కరే తోయిబా ఉగ్రవాది అబు ఖతాల్‌ను మట్టుబెట్టారు. శనివారం రాత్రి పాక్‌లో అతడిని చంపినట్లు సమాచారం అందుతోంది. ఉగ్ర సంస్థలో ఖతాల్ కీలక వ్యక్తిగా ఉన్నారు. జమ్ము కశ్మీర్ ఉగ్రవాదంలో ఇతనికి కీలక పాత్ర ఉంది.
ఉగ్రసంస్థ ఐసిస్‌కు చెందిన ఉగ్రవాది అబ్దుల్లా మకి ముస్లిహ్ రిఫయ్ అలియాస్ అబూ ఖదీజాను ఇరాక్ బలగాలు మట్టుబెట్టాయి. అబూ ఖదీజా ఇరాక్‌లో తలదాచుకుంటున్నాడనే సమాచారంతో అమెరికా సైన్యంతో కలసి ఇరాక్ సైనికులు ఉగ్రవాదిని ఖతం చేశారు. ఇతను అత్యంత ప్రమాదకారి అని ఇరాక్ ప్రధాని మహమ్మద్ షియా అల సుదానీ వ్యాఖ్యానించారు. ఉగ్రవాదిని అంతమొందించినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ట్వీట్ చేశారు. అమెరికా దళాలు రహస్య ఆపరేషన్ ద్వారా గురువారం అబూ ఖదీజాను మట్టుబెట్టాయి.