వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పూర్వం రోజుల్లో రాజులు కోటలో ఉండేవారని, కోటరీలో వారి చెప్పుడు మాటలు వినేవారని, తెలివైన రాజులు మారు వేషాల్లో ప్రజల కష్టాలు తెలుసుకునేవారంటూ మొదలుపెట్టారు. జగన్‌మోహన్‌రెడ్డిపై కోటరీ మాటలు ఇంకా నమ్మితే భవిష్యత్తులో సీఎం కాలేడని వ్యాఖ్యానించారు. కొందరి కోటరీ వ్యక్తుల మాటలు నమ్మి జగన్‌మోహన్‌రెడ్డిపై పూర్తిగా మోసపోయాడన్నారు. తనను కొందరు తొక్కుకుంటూ ఒక్కో మెట్టు పైకి ఎదిగారంటూ వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్షారెడ్డిని ఉద్దేశించి ట్వీట్ చేశారు.
విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. లిక్కర్ స్కాం విచారణలో భాగంగా మంగళగిరి సిఐడి ముందు హాజరైన విజయసాయిరెడ్డి, మద్యం కుంభకోణంలో భూసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డిదే కీలక పాత్ర అంటూ, కాకినాడ పోర్టు వ్యవహారంలో వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డే ప్రధాన సూత్రదారుడని వెల్లడించారు. తాను త్వరలో మరిన్ని సంచలనాలు బయట పెడతానంటూ చెప్పారు.
జగన్‌మోహన్‌రెడ్డిపై అక్రమాస్తుల కేసులో ఏ2గా ఉన్న విజయసాయిరెడ్డి అప్రూవర్‌గా మారతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వైసీపీలో తనను చాలా ఇబ్బంది పెట్టారని రాజకీయాలకు శాశ్వతంగా దూరంగా జరుగుతున్నానంటూ చెప్పుకొచ్చిన విజయసాయిరెడ్డి మీడియాతో మాత్రం సంచలన విషయాలు చెపుతున్నారు. తాను వ్యవసాయం చేసుకుంటానంటూనే జగన్‌మోహన్‌రెడ్డిపై విరుచుకుపడుతున్నారు.
వైసీపీలో కీలక నేతగా ఐదేళ్ల పరిపాలనలో చక్రం తిప్పిన విజయసాయిరెడ్డి ఆ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిపై తిరుగుబావుటా ఎగురవేయడం వెనుక పెద్ద తనకు అవమానమే జరిగిందని భావిస్తున్నారు. నాలుగు దశాబ్దాలపాటు, మూడు తరాల వైఎస్ కుటుంబానికి ఆడిట్ సేవలు అందించిన విజయసాయిరెడ్డి వైసీపీ పెట్టగానే అందులో చేరారు. అక్రమాస్తుల కేసులో జగన్‌మోహన్‌రెడ్డితో పాటు విజయసాయిరెడ్డి 16 నెలలు జైలు జీవితం అనుభవించారు. వైసీపీలో నెంబర్2గా ఉత్తరాంధ్ర జిల్లాలకు బాధ్యుడిగా చక్రంతిప్పిన విజయసాయిరెడ్డి తిరుగుబాటు వెనుక పెద్ద కథే నడిచిందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. విజయసాయిరెడ్డి మరికొన్ని సంచనాలు బయటపెడతానంటూ మీడియా ముందే చెప్పడంతో ఆ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఎలాంటి చర్యలు తీసుకుంటారనే దానిపై సర్వత్రా చర్చకు దారితీసింది.