రంగుల పండుగ హోలీ వేళ దేశ ఆర్థిక రాజధాని ముంబైలో పెద్ద ఎత్తున ట్రాఫిక్ ఉల్లంఘనలు జరిగాయి. మార్చి 13,14 తేదీల్లో 17,495 మంద్రి ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించారు. వారికి విధించిన జరిమానాల విలువ రూ.1.79 కోట్లు గా తేలింది.
హెల్మెట్ లేకుండా వాహనం నడిపినందుకు గానూ 4,949 కేసులు నమోదు కాగా మద్యం తాగి వాహనం నడిపినందుకు 183 మందిపై కేసు నమోదైంది. రాంగ్ వే డ్రైవింగ్ చేసినందుకు గానూ 33 కేసులు, వన్ వే కింద 992 కేసులు, ట్రిపుల్ రైడింగ్ చేసినందుకు గానూ 425 మందిపై ట్రాఫిక్ పోలీసులు కేసులుపెట్టారు.
సిగ్నల్ జంపింగ్‌కు 1,942 కేసులు, లైసెన్స్ లేకుండా వాహనం నడిపినందుకు గానూ 826 కేసులు నమోదు చేశారు. రెండు రోజుల పాటు నిర్వహించిన డ్రైవ్‌లో రూ.1.79 కోట్ల విలువైన 17,495 జరిమానాలు విధించారు.