గుంటూరు నగర మేయర్ కావటి మనోహర్‌నాయుడు పదవికి రాజీనామా చేశారు. ఇటీవల జరిగిన స్టాండింగ్ కమిటీల్లో టీడీపీ, జనసేన ఆరు కమిటీలను గెలుచుకున్నాయి. 18 మంది వైసీపీ కార్పొరేటర్లు టీడీపీ, జనసేనకు మద్దతు పలికారు. ఈ నెల 17న కార్పొరేషన్ సమావేశం జరగనుంది. స్టాడింగ్ కమిటీలు ఓడిపోవడంతో మేయర్ తొలగింపునకు కూటమి సిద్దమవుతోందనే సమాచారంతో మనోహర్‌నాయుడు రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.
గత కొంత కాలంగా గుంటూరు కమిషనర్ పులి శ్రీనివాసులు, మనోహర్ నాయుడు మధ్య విభేదాలు తార స్థాయికి చేరాయి. వైసీపీ కార్పొరేటర్లు కూడా కూటమిలో చేరిపోవడంతో మనోహర్ నాయుడు రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. మరో ఏడాది పదవీ కాలం ఉండగానే ఆయన రాజీనామా చేశారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో చిలకలూరిపేట వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.