సావరిన్ గోల్డ్ బాండ్స్‌లో పెట్టుబడులు పెట్టిన వారికి లాభాల పంట పండింది. కేంద్ర ప్రభుత్వం 2016లో మొదటిసారి విడుదల చేసిన సిరీస్ 4 బాండ్లకు రిడెంప్షన్ తేదీని రిజర్వు బ్యాంక్ ప్రకటించింది. మార్చి 17న మెచ్చూర్ తేదీగా నిర్ణయించారు. 2016లో లక్ష పెట్టుబడి పెట్టిన వారికి మార్చి 17న మూడు లక్షలు అందనున్నాయి. అంటే సావరిన్ గోల్డ్ బాండ్లు ( sovereign gold bonds) మూడు రెట్లు లాభాలను పంచాయని చెప్పవచ్చు.
సావరిన్ గోల్డ్ బాండ్ల కాల పరిమిది ఎనిమిదేళ్లు. 2016లో విడుదల చేసిన బాండ్లు మార్చి 17న మెచ్చూరిటీ పొందుతాయి. అప్పట్లో గ్రాము బంగారం ధర రూ.2943గా ఉంది. తాజాగా బంగారం ధర రూ.8624గా రిజర్వు బ్యాంకు పేర్కొంది. దీనికి అధనంగా గోల్డ్ బాండ్లపై 2.5 శాతం నామమాత్రపు వడ్డీ చెల్లించనున్నారు.