ఏపీ ఈఏపీ సెట్-2025కు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. జేఎన్టీయూకే నిర్వహించే ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్షకు దరఖాస్తుల స్వీకరిస్తున్నట్లు సెట్ ఛైర్మన్ సీఎస్‌ఆర్‌కే ప్రసాద్ తెలిపారు. అపరాధ రుసుం లేకుండా ఏప్రిల్ 24 వరకు, రూ.10 వేల అపరాధ రుసుంతో మే 16 వరకు సెట్ కు దరఖాస్తు చేసుకోవచ్చు అని సెట్ చైర్మన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
ఆన్‌లైన్ విధానంలో మే 19 నుంచి27 వరకు ఈ పరీక్షలు ఉంటాయని, ఏపీలో 46, హైదరాబాద్‌లో 2 కేంద్రాల్లో కలిపి మొత్తం 48 చోట్ల పరీక్షలు నిర్వహించనున్నట్లు వివరించారు. హాల్‌టికెట్లను మే 12 నుంచి ఈఏపీసెట్ వెబ్‌సైట్‌తో పాటు రాష్ట్ర ప్రభుత్వ వాట్సప్ నంబరు నుంచీ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఉర్దూ మాధ్యమాన్ని ఎంచుకునేవారు కర్నూలులో పరీక్షలు రాయాల్సి ఉంది. http://cets.apsche.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు.