లొంగిపోతే ప్రాణాలతో ఉంటారంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్ సేనలను హెచ్చరించారు. శాంతి చర్చలు సాగుతున్న వేళ రష్యా అధ్యక్షుడు చేసిన హెచ్చరికలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఉక్రెయిన్ పట్ల కనికరం చూపాలంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సూచనల మేరకు వ్యవహరిస్తున్నామని పుతిన్ వ్యాఖ్యానించారు.
కర్క్స్ ప్రాంతాన్ని ఉక్రెయిన్ సేనలు ఆక్రమించుకున్నాయి. వెంటనే విడిచి వెళ్లాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ హెచ్చరికలు జారీ చేశారు. లొంగిపోతే సైనికుల ప్రాణాలకు హామీ ఇవ్వగలనని చెప్పారు. అంతర్జాతీయ యుద్ధ నేరాల ప్రకారం శిక్ష ఉంటుందన్నారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ శాంతి చర్చలకు పిలుపునిచ్చినా ఉక్రెయిన్,రష్యా తలపడుతూనే ఉన్నాయి. అమెరికా ఇప్పటికే ఉక్రెయిన్‌కు సాయం నిలిపివేసింది. అయినా ఉక్రెయిన్ పలు ఐరోపా దేశాల నుంచి సాయం తీసుకుంటూ రష్యాపై పోరు కొనసాగిస్తోంది.