పశ్చిమబెంగాల్ పూర్వమేదినీపూర్ జిల్లాలో నందిగ్రామ్ బ్లాక్2లోని కమల్‌పూర్ గ్రామంలో ఒక దేవాలయం మీద దాడి జరిగింది. ఆ గుడిలోని దేవతా మూర్తుల విగ్రహాలను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేసారు. ఆ దాడికి సంబంధించిన దృశ్యాలను బీజేపీ నేతలు అమిత్ మాలవీయ, సువేందు అధికారి ఎక్స్ సామాజిక మాధ్యమంలో విడుదల చేసారు. ఆ వీడియోలో హిందువుల దేవీదేవతల విగ్రహాల మీద దాడి చేసారు.
సువేందు అధికారి కథనం ప్రకారం… గత మంగళవారం నుంచీ స్థానిక ప్రజలు ఆ ఆలయంలో పూజాదికాలు చేస్తున్నారు. అయితే పూజ, రామనారాయణ కీర్తనలూ ఏ అవాంతరాలూ లేకుండా జరిగిపోయాయి. ఆ తర్వాతే ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి.
‘‘శ్రీరామ నామాన్ని జపించడాన్ని కొంతమంది వ్యక్తులు తట్టుకోలేకపోతున్నారు. వారు ఈ ప్రదేశాన్ని నాశనం చేసారు. స్థలం మొత్తాన్ని ధ్వంసం చేసారు. దేవతా మూర్తులను అపవిత్రంగా ధ్వంసం చేసారు’’ అని అమిత్ మాలవీయ వ్యాఖ్యానించారు.
ఈ మొత్తం వ్యవహారంపై స్థానిక అధికారులు, పోలీసులూ ఉదాసీనంగా స్పందించిన తీరును అమిత్ మాలవీయ తప్పుపట్టారు.