వలపు వల విసిరి పాక్ ఐఎస్ఐ ఏజంట్ భారత మిలటరీ సిబ్బంది ఒకరి నుంచి కీలక రహస్యాలు తెలుసుకున్నట్లు యూపీ పోలీసులు అనుమానిస్తున్నారు. నకిలీ ఫోటోతో పేరు మార్చుకుని వలపు వల విసిరిన పాక్ ఏజంట్, భారత మిలటరీకి చెందిన ఫిరోజాబాద్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో మెకానిక్‌గా పనిచేసే రవీంద్ర కుమార్‌కు కొంత నగదు కూడా పంపినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. వలపు వలతోపాటు, కొంత నగదు కూడా పొందిన రవీంద్ర కుమార్ పాక్ ఏజంట్లకు నేరుగా మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు.
పాకిస్థాన్ ఐఎస్ఐ ఏజంటుగా పనిచేస్తూ విషయం దాచిన నేహాశర్మకు రవీంద్రకుమార్ అనేక మిలటరీ రహస్యాలను చేరవేశాడని పోలీసులు అనుమానిస్తున్నారు. గగన్ యాన్‌కు సంబంధించిన సమాచారం కూడా లీక్ చేసినట్లు మిలటరీ అధికారులు అనుమానిస్తున్నారు. అతని వాట్సప్ ద్వారా పాక్ ఏజంటుకు డ్రోన్ల తయారీ పురోగతిపై కూడా సమాచారం పంపించాడని తెలుస్తోంది.
చంద్రన్ పేరుతో పాక్ ఐఎస్ఐ ఏజంటు నెంబరు సేవ్ చేసుకున్న రవీంద్రన్ వారితో నేరుగా టచ్‌లో ఉన్నట్లు మిలటరీ అధికారులు గుర్తించారు. అతని వాట్సప్ నుంచి పలు కీలక సమాచారం పాక్ ఏజంటుకు పంపినట్లు గుర్తించారు. రవీంద్రకుమార్‌తోపాటు అతనికి సహకరించిన మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.