ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం దక్కింది. నాలుగు దశాబ్దాలపాటు సినీరంగంలో విశేష కృషి చేసినందుకు బ్రిటన్ పార్లమెంట్ జీవిత సాఫల్య పురష్కారం అందించాలని నిర్ణయించింది. పునాదిరాళ్లు చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేసిన చిరంజీవి అనేక ఇబ్బందులను ఎదుర్కొని నాలుగు దశాబ్ధాలపాటు సినీరంగంలో 156 చిత్రాల్లో నటించారు.
అత్యధిక స్టెప్లులు వేసిన నటుడిగా ఇటీవల గిన్నిస్ రికార్డును మెగాస్టార్ చిరంజీవి సొంతం చేసుకున్నారు. 2006లో కేంద్ర ప్రభుత్వం చిరంజీవికి పద్మభూషన్, 2024లో పద్మవిభూషన్ పురస్కారం అందించింది. 9 ఫిల్మ్ ఫేర్ అవార్డులు, 3 నంది అవార్డులు అందుకున్న చిరంజీవి తాజాగా ఆయన విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. త్వరలో అది ప్రేక్షకుల ముందుకు రానుంది.