దేశ వ్యాప్తంగా హోలీ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో హోలీ వేడుకలు కొనసాగుతున్నాయి. అల్లూరి జిల్లా తాజంగి బీటా లైన్ కాలనీలో గిరిజనులు హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఒడిశా నుంచి వచ్చి బీటా కాలనీలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న గిరిజనులు ఏటా హోలీ వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీ. 60 అడుగుల ఎత్తైన కర్రల పోగు జెండా తయారు చేసి వేకువ జామున దహనం చేశారు. ఇలా చేస్తే పంటలు బాగా పండుతాయని గిరిజనుల నమ్మకం.
స్థానిక గిరిజనులు ముందుగా సమీపంలోని రాధాకృష్ణ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామనామ స్మరణ, భజనలతో రాధాకృష్ణ విగ్రహాలను ఊరేగించారు. అనంతరం 60 అడుగుల కర్రలపోగును దహనం చేశారు. కర్రల పోగు దహనం సమయంలో ఎటువైపు పడితే అటువైపు పంటలు బాగా పండుతాయని గిరిజనుల విశ్వాసం. జెండా పట్టుకున్న వారిని కానుకలు సమర్పించి వారిని ఊరంతా ఊరేగిస్తారు.