అమెరికాలోని డెన్వర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. విమానం దిగిన వెంటనే భారీగా మంటలు అంటుకున్నాయి. సిబ్బంది వెంటనే ప్రయాణీకులను ఎమర్జెనీ ద్వారం నుంచి బయటకు పంపించారు. విమానం రెక్కలపై నుంచి ప్రయాణీకులు దిగుతోన్న వీడియో వైరల్ అయింది. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తునకు ఆదేశించారు. అమెరికాలో గురువారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది.
అమెరికాలోని కొలరాడో స్ప్రింగ్స్ ఎయిర్‌పోర్ట్ నుంచి డాలస్‌కు బయలుదేరిన విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. సాంకేతిక లోపం గమనించడంతో ఫైలెట్ డెన్వర్‌కు మళ్లించి అత్యవసరంగా దించారు. విమానం ల్యాండ్ అయిన వెంటనే భారీ మంటలు అంటుకున్నాయి.
క్షణాల్లో విమానం మొత్తం కాలిపోయింది. ప్రయాణీకులను అత్యవసర ద్వారం నుంచి 2 నిమిషాల్లో దించివేయడంతో ప్రమాదం తప్పింది. ఎవరికీ ఎలాంటి హాని జరగలేదని అధికారులు ప్రకటిచారు. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 172 మంది ప్రయాణీకులున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.