సీబీఐ తన వద్ద నుంచి సీజ్ చేసిన 53 కేజీల బంగారు ఆభరణాలు తుప్పు పడతాయి.. విడిపించాలంటూ మాజీ మంత్రి గాలి జానార్థన్‌రెడ్డి హైదరాబాదులోని ప్రత్యేక కోర్టును ఆశ్రయించారు. 2011లో ఓబులాపురం ఇనుప గనుల అక్రమ తవ్వకాల కేసులో సీబీఐ కేసు నమోదు చేసి ఆస్తులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.
మాజీ మంత్రి గాలి జనార్థాన్‌రెడ్డిపై నమోదైన కేసు పదమూడేళ్లుగా విచారణ కొనసాగుతూనే ఉంది. దీనిపై తుది తీర్పు రాకపోవడంతో స్వాధీనం చేసుకున్న 53 కేజీల బంగారు ఆభరణాలు సీబీఐ అధీనంలో ఉన్నాయి. వాటిని విడిపించాలంటూ గాలి జనార్ధన్‌రెడ్డి, ఆయన కుమారుడు కిరీట్ రెడ్డి, కుమార్తె బ్రహ్మణి పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వు చేశారు.