ఒంటిపూట బడులపై తెలంగాణ విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది. మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు ప్రారంభమవుతాయని ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పరిధిలోని అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు మార్చి 15 నుంచి ఒంటిపూటే నిర్వహించనున్నారు. ఏప్రిల్ 23 వరకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పాఠశాలలు పనిచేస్తాయని ఆదేశాల్లో వివరించింది.
ప్రభుత్వ ఆదేశాలను అన్ని మేనేజ్‌మెంట్లు అమలు చేసేలా పాఠశాల విద్యాశాఖ రీజినల్ జాయింట్ డైరెక్టర్లు జిల్లా విద్యాశాఖ అధికారులు తగిన చర్యలు తీసుకోనున్నారు. పదో తరగతి విద్యార్థులను సన్నద్ధం చేసేందుకు ప్రత్యేక తరగతులు కొనసాగుతాయని స్పష్టం చేసింది.
పదో తరగతి పరీక్ష కేంద్రాలు ఉన్న పాఠశాలలు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేయనున్నాయి.