ప్రముఖ ఐటీ సంస్థ మైక్రోసాఫ్ట్‌తో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది. రాబోయే నాలుగేళ్లలో 2 లక్షల మంది విద్యార్థులకు ఏఐ, ఇతర రంగాల్లో మైక్రోసాఫ్ట్ శిక్షణ ఇవ్వనుంది. ఇందుకు 50 గ్రామీణ ఇంజనీరింగ్ కాలేజీలను ఎంచుకున్నారు. 500 ఐటీఐ కాలేజీల విద్యార్ధులకు కూడా నైపుణ్య శిక్షణ అందించేందుకు మైక్రోసాఫ్ట్ ఒప్పందం చేసుకుంది.
విద్యార్థులు చదువు పూర్తి కాగానే ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకునేలా మైక్రోసాఫ్ట్ శిక్షణ ఇవ్వనుంది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆ సంస్థకు అవసరమైన సౌకర్యాలు కల్పించనుంది. ఇంజనీరింగ్ కాలేజీ అధ్యాపకులకు కూడా నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నారు. మైక్రోసాఫ్ట్ శిక్షణ ద్వారా 2 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మంత్రి నారా లోకేశ్ సమక్షంలో అధికారులు మైక్రోసాఫ్ట్ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు.