కన్నడ నటి రన్యారావు బంగారం స్మగ్లింగ్ కేసులో అరెస్టు తరవాత కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఈడీ రంగంలోకి దిగింది. దుబాయ్, మలేషియాకు హవాలా మనీ తరలించినట్లు అనుమానిస్తున్నారు. బెంగళూరులో ఏక కాలంలో 8 ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
కర్ణాటక ప్రభుత్వం రన్యారావు కేసును సీఐడి నుంచి తప్పించి పాలనా సంస్కరణల విభాగానికి అప్పగించింది.రన్యారావు తండ్రి మాజీ ఐపీఎస్ రామచంద్రరావు అధికారులను ప్రభావితం చేసే అవకాశం ఉండటంతో సీఐడిని కేసు నుంచి తప్పించినట్లు హోం మంత్రి పరమేశ్వర్ స్పష్టం చేశారు.
రన్యారావు వివాహానికి ముఖ్యమంత్రి సిద్దరామయ్య హాజరయ్యారు కదా అని విలేకరి అడిగిన ప్రశ్నకు, సీఎం వేలాది వివాహాలకు హాజరయ్యారంటూ ఆగ్రహంగా సమాధానం చెప్పారు. రన్యారావు కేసులో కీలక రాజకీయ నేతల ప్రమేయం ఉన్నట్లు దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. గోల్డ్ స్మగ్లింగ్‌తోపాటు, హవాలాకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు.