వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో ముందడుగు పడింది. వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్‌రెడ్డి, కేసు విచారించిన సీబీఐ అధికారి రామ్‌సింగ్‌పై పీఏ కృష్ణారెడ్డి 2023 డిసెంబరు 15న పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి హత్య కేసు విచారణలో అడ్డంకులు సృష్టించారు. ఈ కేసును విచారించిన పులివెందుల పోలీసులు తప్పుడు కేసుగా కోర్టుకు సమర్పించారు.
పీఏ కృష్ణారెడ్డి దురద్దేశంతోనే సీబీఐ అధికారి రామ్‌సింగ్, వివేకా కుమార్తె, అల్లుడిపై కేసు పెట్టినట్లు ఛార్జిషీటులో పేర్కొన్నారు. పులివెంయమూర్తి సెలవులో ఉండటంతో, జమ్మలమడుగు కోర్టులో చివరి చార్జిషీటు దాఖలు చేశారు.