మార్చి 15 నుంచి స్పేడెక్స్ ప్రయోగాలు
సొంతంగా అంతరిక్షం కేంద్రం నిర్మించుకోవాలనే భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఆలోచనకు అనుగుణంగా కీలక ముందడుగు పడింది. ప్రపంచంలోనే డాకింగ్ సాంకేతికతన సాధించిన నాలుగో దేశంగా అవతరించిన భారత్, తాజాగా డీ డీ డాకింగ్ ప్రక్రియను విజయంవతంగా చేపట్టింది.
ఉపగ్రహాలను నింగిలోనే అనుసంధానం చేసే మిషన్‌లో భాగంగా గతేడాది డిసెంబర్ 30న ఛేజర్, టార్గెట్ జంట ఉపగ్రహాలను ఇస్రో కక్ష్యలోకి పంపింది. పలు ప్రయత్నాల అనంతరం చివరకు జనవరి 16న డాకింగ్ ప్రక్రియను ముగించింది. నేడు డీ డాకింగ్ ప్రక్రియను నిర్వహించింది. అంటే అనుసంధానమైన రెండు శాటిలైట్లు- ఛేజర్, టార్గెట్‌లను త విడదీసింది. మార్చి 15 నుంచి స్పేడెక్స్ ప్రయోగాలు చేపట్టనున్నట్లు ఇస్రో చీఫ్ వి.నారాయణన్ తెలిపారు.
డీ డాకింగ్ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించిన ఇస్రోకు కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ శుభాకాంక్షలు తెలిపారు. ఇస్రో సాధించిన ఘనత ప్రతి భారతీయుడిలో ఉత్సాహాన్ని నింపుతుందన్నారు. డీ డాకింగ్ర ప్రక్రియ విజయవంతం కావడంతో భారతీయ అంతరిక్ష స్టేషన్ నిర్మాణం, చంద్రయాన్-4, గగన్‌యాన్ సహా భవిష్యత్ ప్రయోగాలకు మార్గం సుగమం అయిందన్నారు.