మైనారిటీ కావడంతో వివక్ష ఎదుర్కొన్నట్లు డానిష్ కనేరియా వ్యాఖ్య
మత మార్పిడీకి అఫ్రిది ప్రయత్నించాడని వాపోయిన స్పిన్నర్
పాకిస్తాన్ మాజీ క్రికెట్ డానిష్ కనేరియా తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. దేశం తరఫున జట్టులో ఆడినప్పుడు తోటి ఆటగాళ్ళ నుంచి తీవ్ర వివక్ష ఎదుర్కున్నట్లు తెలిపాడు.వాషింగ్టన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న డానిష్ కనేరియా పాకిస్తాన్ తీవ్ర వివక్షను ఎదుర్కొన్నట్లు వాపోయాడు. . తన కెరీర్ నాశనం కావడానికి మతపరమైన వివక్షే కారణమన్నారు.
మైనారిటీని కావడంతో జట్టులో తగిన గౌరవం దక్కలేదని, ఇప్పుడు అమెరికాలో ఉండడంతో పాక్‌లో తాను ఎదుర్కొన్న వివక్ష, ఇబ్బందులపై మాట్లాడే అవకాశం దక్కిందన్నాడు.
పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది సహా కొందరు ఆటగాళ్ళు మతం మారమని తనను ఇబ్బంది పెట్టేవారని తెలిపాడు. షోయబ్ అక్తర్ సహా ఇతర ఆటగాళ్లు తీవ్రంగా ఇబ్బంది పెట్టారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇంజమామ్ ఉల్ హక్ మాత్రమే తనకు మద్దతుగా నిలిచేవాడని నాటి రోజులను గుర్తు చేసుకున్నాడు. పాకిస్తాన్ తరఫున 61 టెస్టుల్లో కనేరియా ఆడాడు.