Friday, May 9, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home క్రైమ్ న్యూస్

లైంగిక వేధింపుల కేసు నిందితుడు ఏసీపీ మొహిసిన్ ఖాన్ మూడునెలల తర్వాత సస్పెన్షన్

Phaneendra by Phaneendra
Mar 13, 2025, 12:08 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ఉత్తరప్రదేశ్‌లోని ఐఐటీ కాన్పూర్‌లో ఒక విద్యార్ధినిని లైంగికంగా వేధించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న కాన్పూర్ నగర ఏసీపీ మొహిసిన్ ఖాన్ మీద సస్పెన్షన్ వేటు పడింది. యూపీ డీజీపీ కార్యాలయం మొహిసిన్ ఖాన్‌ను సస్పెండ్ చేస్తూ నిన్న అంటే మార్చి 12న ఉత్తర్వులు జారీ చేసింది.

బాధితురాలు గతవారం ఉత్తరప్రదేశ్ డిజిపికి లేఖ రాసింది. ఆ లేఖలో ‘‘నిందితుడు పోలీసు అధికారి అయినందున అతన్ని అరెస్ట్ చేయలేదు. శాఖాపరంగానూ ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. అతని మీద ఛార్జిషీట్ దాఖలు చేయకుండా, అతన్ని అరెస్ట్ చేయకుండా నిందితుడు హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నాడు’’ అని ఆవేదన వ్యక్తం చేసింది. అతని దుశ్చర్యలు తన కెరీర్‌ను ప్రభావితం చేయడమే కాదు, తనను మానసికంగా డిప్రెషన్‌కు గురిచేసాయని వివరించింది. తదుపరి విచారణ మార్చి 20న ఉందనీ,  ఆరోజు తన వాదనను బలంగా వినిపిస్తాననీ బాధితురాలు డీజీపీకి రాసిన లేఖలో పేర్కొంది. మార్చి 20నాటి విచారణ తర్వాత నిందితుడి మీద విచారణ జరపాలా వద్దా అన్న విషయంపై అలహాబాద్ హైకోర్టు నిర్ణయం తీసుకుంటుంది.

ఈ వ్యవహారం మీద రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్‌ ఏర్పాటు చేసింది. సిట్ నివేదిక రావడంతో దాన్ని కాన్పూర్ పోలీస్ కమిషనర్ బుధవారం నాడు రాష్ట్రప్రభుత్వానికి పంపించారు. దాన్ని పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం నిందితుణ్ణి సస్పెండ్ చేసింది. అతన్ని డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేసింది. సస్పెన్షన్ లేఖ అధికారికంగా కాన్పూర్ పోలీస్ కమిషనర్ కార్యాలయానికి చేరాక అతనిపై శాఖాపరమైన  విచారణ మొదలవుతుంది. ఆ తర్వాతే అతనికి విధించాల్సిన శిక్ష ఖరారవుతుంది.

బాధితురాలు 2024 డిసెబర్ 12న కళ్యాణ్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఏసీపీ మొహిసిన్‌ఖాన్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. దాంతో కళ్యాణ్‌పూర్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసారు. ఆ ఎఫ్ఐఆర్‌ను రద్దు చేయాలని, తనను అరెస్ట్ చేయకుండా స్టే ఇవ్వాలనీ కోరుతూ మొహిసిన్ ఖాన్ డిసెంబర్ 16న హైకోర్టులో పిటిషన్ వేసాడు.  బాధితురాలి ఫిర్యాదు తర్వాత ఏసీపీని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేసారు. ఆ తర్వాత దర్యాప్తును సిట్‌కు అప్పగించారు.

ఒక ఐఐటీ విద్యార్ధినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన మొహిసిన్ ఖాన్, పోలీసు వ్యవస్థలో ఏసీపీ స్థాయి అధికారి కావడం వల్లనే అతనిపై సస్పెన్షన్ వేటు వేయకుండా మూడు నెలలు జాప్యం జరిగిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

Tags: IIT KanpurKanpur ACPMohsin KhanSexual HarassmentSuspension of AccusedTOP NEWSUttar Pradesh
ShareTweetSendShare

Related News

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్
Latest News

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు
general

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.