చిత్తూరులో ఈ ఉదయం కాల్పుల సంఘటన కలకలం రేపింది. ఒక వ్యాపారి ఇంట్లో మరో వ్యాపారి దోపిడీ చేయడానికే కుట్ర పన్నారని పోలీసులు కనుగొన్నారు.
చిత్తూరు నగరంలోని లక్ష్మీ సినిమా హాల్ సమీపంలో ఉన్న పుష్ప కిడ్స్ వరల్డ్ యజమాని చంద్రశేఖర్ ఇంట్లోకి దొంగల ముఠా చొరబడింది. వారు రెండు తుపాకులతో గాల్లోకి కాల్పులు జరిపారు. చంద్రశేఖర్ వెంటనే అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు సకాలంలో చేరుకున్న పోలీసులు దొంగలముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. తుపాకులు, బుల్లెట్లను జప్తు చేసారు. ఆ సంఘటనలో చంద్రశేఖర్‌కు గాయాలయ్యాయి.
ఆ దాడి సంఘటనపై పోలీసులు దర్యాప్తు నిర్వహించగా విస్తుపోయే నిజాలు వెలుగు చూసాయి. ఆ దోపిడీకి కుట్ర పన్నింది ఎస్ఎల్వీ ఫర్నీచర్ దుకాణం యజమానే అని తెలుసుకున్నారు. దుండగులు రబ్బర్ బుల్లెట్లు వాడే తుపాకులతో దోపిడీకి ప్రయత్నించారు. చిత్తూరు పోలీసులు రెండున్నర గంటల పాటు ఆపరేషన్ నిర్వహించి. దొంగల ముఠాను పట్టుకోగలిగారు.