ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) మాజీ వ్యవస్థాపకుడు లలిత్ మోదీ వనౌతు పాస్ పోర్టు రద్దు అయింది. లలిత్ కు ఇటీవల వనౌతు జారీ చేసిన పాస్‌పోర్ట్‌ను రద్దు చేయాలని ఆ దేశ ప్రధాని జొథమ్ నపట్ ఆదేశించారు. పరారీలో ఉన్న నిందితుడు (లలిత్ మోదీ)భారత్‌కు అప్పగింత నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని నపట్ పేర్కొన్నారు.
లలిత్ మోదీ, ఐపీఎల్ చీఫ్ గా వ్యవహరించిన సమయంలో కోట్లాది రూపాయలను లంచంగా తీసుకున్నాడనే ఆరోపణలపై దర్యాప్తు విభాగాలు విచారణ చేపట్టాయి. వాటిని ఎదుర్కోవడానికి బయపడిన లలిత్ 2010లో దేశం వీడి పారిపోయాడు. దాదాపు 14 ఏళ్ళగా లండన్ లో స్థిరపడ్డాడు.
వనౌతు పాస్‌పోర్టు పొందిన లలిత్ మోదీ, తన భారత పాస్‌పోర్టును లండన్‌లోని భారత హైకమిషన్ కార్యాలయానికి అప్పగించేందుకు దరఖాస్తు చేసుకున్నాడు.
తాజా పరిణామాల నేపథ్యంలో వనౌతు ప్రధాని కార్యాలయం స్పందించింది. అంతర్జాతీయ మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా లలిత్ కు కేటాయించిన పాస్ పోర్టును రద్దు చేస్తున్నట్లు ప్రకటించిందిత. పాస్‌పోర్టు దరఖాస్తు పరిశీలన సమయంలో ఇంటర్‌పోల్ సహా ఇతర అంతర్జాతీయ వ్యవస్థల నుంచి అతడిపై జారీ చేసిన నోటీసులు లేవని తమ విచారణలో తేలిందన్నారు.