ఎస్సీ వర్గకరణ అంశంపై ఏపీ ప్రభుత్వానికి రాజీవ్ నందర్ మిశ్రా కమిషన్ నివేదిక అందజేసింది. సీఎస్ విజయానంద్ కు రాజీవ్ నందన్ నివేదికను అందజేశారు. ఎస్సీ ఉపవర్గాల్లో ఆర్థిక స్వావలంబనపై ఏకసభ్య కమిషన్, రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి
అధ్యయనం చేసింది. అలాగే పలువురి నుంచి విజ్ఞప్లులు, అభ్యర్థనలు సేకరించింది.
ఈ కమిషన్ ను ఏపీ ప్రభుత్వం గత ఏడాది నవంబర్15న ఏర్పాటు చేసింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్‌రంజన్ మిశ్రాను ఏక సభ్యుడిగా వ్యవహరించారు.
ఈ నివేదికను కేబినెట్ ఆమోదించిన తర్వాత వర్గీకరణ సాధ్యమవుతుంది. తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ కోసం ఆ రాష్ట్రప్రభుత్వం జస్టిస్ షమీమ్ అక్తర్ కమిషన్ వేసింది. ఆ కమిషన్ చేసిన సిఫార్సులన్నింటినీ ప్రభుత్వం దాదాపు అంగీకరించింది.
వర్గీకరణ అంశం తేలితే ఉద్యోగ ప్రకటనల విషయంలో న్యాయపరమైన చిక్కులు తొలుగుతాయి. ఈ నెలలోనే డీఎస్సీ నోటిఫికేషన్ ఉంటుందని ఇటీవల విద్యామంత్రి నారా లోకేశ్ తెలిపారు.