మయన్మార్‌లో తిరుగుబాటుదారులకు ఆయుధ శిక్షణ ఇస్తున్నది అమెరికా, ఇంగ్లండ్ ఏజెంట్లే అని మిజోరం ముఖ్యమంత్రి లాల్‌దుహోమా ప్రకటించారు. అలాంటి ఏజెంట్లు కొందరు మిజోరం నుంచి మయన్మార్ వెళ్ళారనీ, వారు రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో పాల్గొన్నారనీ లాల్‌దుహోమా ఒక ప్రకటనలో తెలియజేసారు.
మిజోరం ముఖ్యమంత్రి లాల్‌దుహోమా సంచలనాత్మక ప్రకటనలు అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించాయి. ఆసియా దేశాల్లో అస్థిరత కలిగించేందుకు అమెరికా, ఇంగ్లండ్ వంటి దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయా అని అనుమానం కలిగించేలా ఉంది ఆయన చేసి ప్రకటన.
లాల్ దుహోమా మరో విషయం చెప్పారు. 2024 జూన్-డిసెంబర్ వ్యవధిలో మిజోరం రాజధాని ఐజ్వాల్‌కు 2వేలమంది విదేశీయులు వచ్చారు, కానీ వారు తర్వాత ఎక్కడా కనిపించలేదని లాల్‌దుహోమా అన్నారు. ఆ విదేశీ వ్యక్తులు భారత్ నుంచి మయన్మార్ వెళ్ళి ఉంటారనీ, మయన్మార్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యానికి వారు కుట్ర పన్ని ఉండవచ్చుననీ దుహోమా సంకేతాలు ఇచ్చారు.