భారత రెజ్లింగ్ ఫెడరేషన్ మీద విధించిన సస్పెన్షన్‌ను కేంద్ర క్రీడామంత్రిత్వ శాఖ తొలగించింది. రెజ్లింగ్ క్రీడకు జాతీయ స్థాయి క్రీడా సంస్థగా దాని గుర్తింపును కూడా పునరుద్ధరించింది.
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మీద కేంద్రప్రభుత్వంలోని క్రీడల మంత్రిత్వశాఖ డిసెంబర్ 2023లో సస్పెన్షన్ వేటు విధించింది. రెజ్లింగ్ ఫెడరేషన్‌కు అధ్యక్షుడిగా సంజయ్ సింగ్ అప్పుడే కొత్తగా ఎన్నికయ్యారు. ఆ హోదాలో ఆయన అండర్ 15, అండర్ 20 జాతీయ పోటీలను ఉత్తరప్రదేశ్‌లోని గోండా జిల్లాలో నిర్వహిస్తామని కూడా ప్రకటించారు. ఆ దశలోనే ఫెడరేషన్ మీద వేటు పడింది.
2023 ప్రారంభం నుంచే వినేష్ ఫోగాట్, సాక్షి మలిక్, బజరంగ్ పూనియా వంటి అగ్రశ్రేణి క్రీడాకారులు అప్పటి ఫెడరేషన్ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ సింగ్ మీద లైంగిక వేధింపుల ఆరోపణలు చేసి, నిరసనలూ ఉద్యమాలూ మొదలుపెట్టారు. దానివల్ల నిర్ణీత సమయంలో ఫెడరేషన్‌కు ఎన్నికలు జరగలేదు. దాన్ని సాకుగా చూపించి యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ సంస్థ భారత రెజ్లింగ్ ఫెడరేషన్ మీద 2023 ఆగస్టులో నిషేధం విధించింది. అప్పుడు అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం ఒక అడ్ హాక్ కమిటీని నియమించింది.
2023 డిసెంబర్‌లో రెజ్లింగ్ ఫెడరేషన్‌కు ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో బ్రిజ్ భూషణ్ సన్నిహితుడైన సంజయ్ సింగ్ అధ్యక్ష పదవికి ఎన్నికయ్యాడు. దాంతో అగ్రశ్రేణి రెజ్లర్లు మళ్ళీ ఆందోళన మొదలుపెట్టారు. సంజయ్ సింగ్ అనేవాడు బ్రిజ్‌భూషణ్ అనుచరుడనీ, అధ్యక్ష పదవిలో అతను ఉంటే బ్రిజ్ భూషణ్ ఉన్నట్టేననీ వారు ఆగ్రహం వ్యక్తం చేసారు. ఎన్నికలు జరిగిన కొద్ది రోజులకే క్రీడల శాఖ మళ్ళీ ఫెడరేషన్‌ను సస్పెండ్ చేసింది. అప్పటినుంచీ ఐఓఏ అడ్‌హాక్ కమిటీయే సంస్థ రోజువారీ నిర్వహణ బాధ్యతలు చూసుకోవాలని ఆదేశించింది.
మార్చి 2024లో అడ్‌హాక్ కమిటీని రద్దు చేసారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మీద యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ సంస్థ నిషేధాన్ని తొలగించింది… భవిష్యత్ పోటీలకు సెలక్షన్ ట్రయల్స్‌ను విజయవంతంగా ముగించాడు. ఆ కారణంతో ఆ ఇకపై అడ్‌హాక్ కమిటీలన్నిటినీ 2024 మార్చిలో రద్దు చేసారు. యునైటెడ్ వైన్స్ కూడా గత ఫిబ్రవరిలో భారత రెజ్లింగ్ ఫెడరేషన్ మీద నిషేధాన్ని తొలగించింది. ఆ నేపథ్యంలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా డబ్ల్యూఎఫ్ఐ మీద సస్పెన్షన్ వేటును తొలగించడం విశేషం.