మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హిందువుల ఆధ్వర్యంలో నడిచే జట్కా మాంసం దుకాణాల కోసం మహారాష్ట్ర ప్రభుత్వం ‘మల్హర్ సర్టిఫికేషన్’ ను అమలు చేయనుంది. ఈ విధానం కోసం ప్రత్యేకంగా ఓ పోర్టల్‌ను తీసుకొచ్చిన ప్రభుత్వం … ఈ సర్టిఫికేషన్ ను కేవలం హిందువులు నడిపే మాంసం దుకాణాలకు మాత్రమే జారీ చేయనున్నట్లు ఫిషరీస్ మంత్రి నితీశ్ రాణే తెలిపారు.
జట్కా మాంసం విక్రేతల కోసం ‘మల్హర్ సర్టిఫికేషన్ డాట్ కామ్’ అనే వేదికను ఏర్పాటు చేస్తున్నట్టు రాణే వివరించారు. హిందువులు నిర్వహించేయ నిర్వహించే మాంసం దుకాణంలో కల్తీ జరగదని తెలిపిన రాణే. మల్హర్ సర్టిఫికేషన్ లేని దుకాణాల్లోనే హిందువులు మాంసం కొనవద్దని సూచించారు.
ఇస్లాంను నమ్మేవారు హలాల్ సర్టిఫికేషన్ జారీ చేస్తారు. అలాంటిదే హిందువుల కోసం మల్హర్ సర్టిఫికేషన్. హలాల్‌లో షరియా, ఇస్లామిక్ చట్టాలకు అనుగుణంగా జంతువులను బలి ఇచ్చి మాంసాన్ని ముక్కులుగా చేస్తారు. ఒక జంతువును తినే ముందు దానిని ఒక నిర్దిష్ట పద్ధతిలో బలి ఇవ్వాలని ఇస్లాం చెబుతుందని ఆ మతాన్ని నమ్మే వారు చెబుతారు. , హలాల్‌కు భిన్నంగా జట్కాలో ఒకే దెబ్బతో నొప్పి లేకుండా జంతువును బలి ఇవ్వడమనేది హిందువుల్లో కొందరు చేసే ప్రక్రియ.
మల్హర్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ లో పేర్కొన్న వివరాల ప్రకారం… జట్కా మటన్, చికెన్ వ్యాపారులకు మల్హర్ సర్టిఫికెట్‌ను అందజేస్తారు. దుకాణంలో మేక లేదా, గొర్రెను బలి ఇచ్చి మాంసాన్ని సిద్ధం చేస్తారు. ఈ మాంసం ప్రత్యేకంగా హిందూ ఖాతిక్ కమ్యూనిటీ విక్రేతల వద్ద దొరుకుతుంది.