చెన్నైలోని శ్రీవారి దేవస్థానం పరకామణిలో ఓ ఉద్యోగి చేతివాటం ప్రదర్శించాడు. విజినెన్స్ నివేదిక మేరకు సీనియర్ అసిస్టెంట్ కృష్ణకుమార్ అనే ఉద్యోగిని సస్పెండ్ చేస్తూ ఈవో శ్యామలరావు నిర్ణయం తీసుకున్నారు.
చెన్నైలోని శ్రీవారి దేవస్థానం పరకామణి లెక్కింపులో ఉద్యోగి కృష్ణకుమార్ విదేశీ కరెన్సీ కాజేసినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. సీసీ కెమెరా ఫుటేజీ పరిశీలించిన విజిలెన్స్ అధికారులు, తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో శ్యామలరావుకు నివేదిక సమర్పించారు. పరిశీలించిన ఈవో ఉద్యోగి కృష్ణ ప్రసాద్‌ను సస్పెండ్ చేశారు.