అనారోగ్యం, అప్పులు ఓ కుటుంబాన్ని బలితీసుకున్నాయి. హైదరాబాద్ హబ్సీగూడలో ఓ కుటుంబం మొత్తం ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.
మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తికి చెందిన చంద్రశేఖర్‌రెడ్డి కుటుంబంతో సహా ఏడాది కిందట హబ్సిగూడకు వచ్చారు. ఆయన కొంత కాలం ఓ ప్రైవేటు కాలేజీలో తరగతులు చెప్పారు. ఆరు నెలలుగా ఉద్యోగం చేయడం లేదు. ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. దీనికి అనారోగ్యం తోడైంది. దీంతో కుటుంబం మొత్తం చనిపోవాలని నిర్ణయించుకున్నట్టు సూసైడ్ నోట్‌లో చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నాడు.
చంద్రశేఖర్‌రెడ్డి, కవిత దంపతులు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. అంతకు ముందు కుమారుడు విశ్వాన్‌రెడ్డికి విషమిచ్చి చంపారు. కుమార్తె శ్రీతరెడ్డికి ఉరివేసి చంపినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఆర్థిక సమస్యలు, అనారోగ్యం కారణంగా చనిపోయిట్లు ప్రాథమిక విచారణలో తేలింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.