విశాఖ ఎండాడలోని వివాదాస్పద హయగ్రీయ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అనాథల ఆశ్రమం, వృద్ధాశ్రమం పేరుతో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా చేసిన సమయంలో 12.51 ఎకరాల భూమిని అతి తక్కువ ధరకు తీసుకున్నారు. ఆ తరవాత అందులో ఆశ్రమం ఏర్పాటు చేయకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రారంభించారు. అప్పటి నుంచి వివాదం మొదలైంది.
హయగ్రీవ ఫార్మ్స్ అండ్ డెవలపర్స్ పేరుతో రూ.250 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిలో రియల్ వ్యాపారం చేయడంపై కూటమి ప్రభుత్వం విచారణ చేపట్టి, భూములను రద్దు చేసింది. నిబంధనలు అన్నీ అతిక్రమించినట్లు రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి సిసోదియా స్పష్టం చేశారు. భూములు స్వాధీనం చేసుకోవాలని విశాఖ కలెక్టర్‌ను ఆదేశించారు. వెంటనే అధికారులు హయగ్రీవ భూములను స్వాధీనం చేసుకుని, అందులో బోర్డులు ఏర్పాటు చేశారు.