బిహార్‌లో దోపిడీ ముఠా బరితెగించింది. పట్టపగలు అరాలోని ఓ నగల దుకాణంలో చొరబడ్డ 8 మంది దుండగులు తుపాకులు చూపించి రూ.25 కోట్ల విలువైన నగలు దోచుకెళ్లారు. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం.
ఉదయం పది గంటలకు దుకాణం తెరవగానే 8 మంది తుపాకులతో వాచ్‌మెన్‌ను బెదిరించి లోపలకు చొరబడ్డారు.వాచ్‌మన్ వద్ద తుపాకీ స్వాధీనం చేసుకున్నారు. షాపులోని వారిని బెదిరించి నగలు, నగదు తీసుకుని మూడు నిమిషాల్లో పరారయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు దుండగులను వెంబడించారు.
పోలీసులకు, దోపిడీ ముఠాకు మధ్య కాల్పులు జరిగాయి. ఇద్దరు దోపిడీ దొంగలు గాయపడ్డారు. అయితే దోపిడీ దొంగలు చిక్కారా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది. దుండగుల కోసం పోలీసులు పెద్ద ఎత్తున గాలిస్తున్నారు. నగలుతోపాటు, నగదు ఎంత తీసుకెళ్లారనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది.