ముంబై నుంచి న్యూయార్క్ బయలు దేరిన ఎయిర్ఇండియా విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. మంగళవారం రాత్రి ముంబై నుంచి 377 మంది ప్రయాణీకులతో ముంబైలో టేకాఫ్ అయిన విమానం అజర్బైజాన్ చేరుకున్న సమయంలో బాంబు బెదిరింపులు వచ్చాయి. విషయాన్ని ఫైలెట్కు తెలియజేయడంతో విమానాన్ని వెనక్కు మళ్లించి ముంబై విమానాశ్రయంలో దింపారు. సిబ్బంది తనిఖీల తరవాత ఫేక్ కాల్ అని తేలడంతో విమానం మరలా టేకాఫ్ అయింది.
ఇటీవల కాలంలో విమానాలకు బాంబు బెదిరింపులు ఎక్కువయ్యాయి. గడచిన ఆరు మాసాల్లో ఇలాంటి కాల్స్ 44 వచ్చాయి. దీనిపై కేంద్ర పౌరవిమానయానశాఖ చర్యలకు ఉపక్రమించింది. కొందరిని అదుపులోకి తీసుకున్నారు. విదేశాల నుంచి బెదిరింపు కాల్స్ వచ్చిన కేసులు ముందుకు సాగడం లేదు. దీనిపై కేంద్రం ఓ చట్టం తీసుకురాబోతోంది. #andhratodaynews