తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా కాంగ్రెస్ నేతలు అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతి నామినేషన్లు దాఖలు చేశారు. అసెంబ్లీ హాల్‌లో జరిగిన కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట రెడ్డి, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలూ హాజరయ్యారు. మరోవైపు, సీపీఐ అభ్యర్థిగా నెల్లికంటి సత్యం, బీఆర్ఎస్ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్ నామినేషన్ వేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు ఎంఐఎం మద్దతు పలికింది. తెలంగాణ శాసనసభలో ఎమ్మెల్యేల సంఖ్యాబలాన్ని బట్టి కాంగ్రెస్‌కు 4, బీఆర్ఎస్‌కు ఒక్క ఎమ్మెల్సీ స్థానాలు దక్కుతాయి. కాంగ్రెస్ ఒక సీటును తమతో పొత్తులో ఉన్న సీపీఐకి కేటాయించింది.