తెలుగు రాష్ట్రాల్లో 2018లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఆ కేసులో ఏ2గా ఉన్న నిందితుడు సుభాష్‌కుమార్ శర్మకు ఉరిశిక్ష విధించింది. ఏ3 అస్గర్ అలీ, ఏ4 బారీ, ఏ5 కరీం, ఏ6 శ్రవణ్‌కుమార్, ఏ7 శివ, ఏ8 నిజాంలకు జీవితఖైదు విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. సుభాష్‌శర్మ ఇప్పటికే జైలులోనే ఉన్నాడు. అస్గర్ అలీ వేరే కేసులో ఖైదీగా ఉన్నాడు. మిగిలిన నిందితులు బెయిల్‌పై బైట ఉన్నారు.
మిర్యాలగూడకు చెందిన అమృత, ప్రణయ్ కులాంతర ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రతీకారంతో రగిలిపోయిన అమృత తండ్రి మారుతీరావు ప్రణయ్ హత్యకు సుపారీ ఇచ్చాడు. 2018 సెప్టెంబర్ 14న మిర్యాలగూడలోని ఓ ఆస్పత్రి వద్ద నిందితులు ప్రణయ్‌ని అతి కిరాతకంగా చంపారు. ఆ హత్య అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది. ఆ కేసులో పోలీసులు విచారణ చేపట్టి ఎనిమిది మందిని నిందితులుగా పేర్కొంటూ 2019లో ఛార్జిషీటు దాఖలు చేశారు. ప్రధాన నిందితుడైన అమృత తండ్రి మారుతీరావు 2020లో ఆత్మహత్య చేసుకున్నాడు