మోస్ట్ వాంటెడ్ డ్రగ్స్ స్మగ్లర్ షహనాజ్ సింగ్‌ను పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల అమెరికాలో ఓ అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లర్ పట్టుబడ్డాడు. అతని వద్ద నుంచి 500 కిలోల మత్తు పదార్ధాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో అమెరికా మోస్ట్ వాంటెడ్ డ్రగ్స్ స్మగ్లర్ తప్పించుకుని భారత్ చేరుకున్నాడు. ఈ విషయాన్ని ఎఫ్‌బిఐ భారత్‌కు సమాచారం అందించింది. పంజాబ్‌కు చెందిన షెహనాజ్ సింగ్ తప్పించుకు తిరుగుతున్నారు. పోలీసులు నిఘా వేసి పట్టుకున్నారు. ఈ విషయాన్ని పంజాబ్ డీజీపీ స్వయంగా ప్రకటించారు.
పంజాబ్‌లో డ్రగ్స్ స్మగ్లర్లకు, పెడలర్లకు స్థానం లేదని డీజీపీ స్పష్టం చేశారు. క్రిమినల్స్‌కు పంజాబ్ స్వర్గధామం కాదన్నారు. రాష్ట్రంలో డ్రగ్స్ అదుపు చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు డీజీపీ తెలిపారు.