ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ భగేల్ కుమారుడి నివాసంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.మద్యం కుంభకోణంలో సమాచారం కోసం సోదాలు నిర్వహిస్తున్నట్లు ఈడీ అధికారులు తెలిపారు. ఏక కాలంలో 15 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. బిలాయ్‌లోని భూపేష్ భగేల్ నివాసంలోనూ సోదాలు నిర్వహించారు.
మద్యం కుంభకోణం కేసు ఏడు సంవత్సరాల విచారణ తరవాత కోర్టు కొట్టివేసిందని, తాజాగా ఇప్పుడు ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారంటూ భూపేష్ భగేల్ మండిపడ్డారు. మద్యం సిండికేటు కారణంగా ప్రభుత్వానికి రూ.2000 కోట్ల నష్టం వాటిల్లింది. దీనిపై ఈడీ తాజాగా సోదాలు చేయడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ కేసులో ప్రభుత్వ అధికారులతోపాటు, కొందరు సారా వ్యాపారులను కూడా అరెస్ట్ చేశారు.