బీజేపీ సీనియర్ నేత సోము వీర్రాజును ఎమ్మెల్సీ సీటు వరించింది. ఏపీలో ఎమ్మెల్యే కోటాలో ఐదు స్థానాలు ఈ నెల 15న ఖాళీ కానున్నాయి. ఇవి భర్తీ చేసేందుకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. నామినేషన్లకు ఇవాళ చివరి రోజు. ఇప్పటికే కూటమిలో భాగంగా జనసేనకు ఒకటి కేటాయించారు. తాజాగా బీజేపీ నుంచి సోము వీర్రాజుకు అవకాశం కల్పించారు.
జనసేన నుంచి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకు ఎమ్మెల్సీ కేటాయించారు. ఇప్పటికే ఆయన నామినేషన్ వేశారు. టీడీపీ 3, బీజేపీ, జనసేన చెరొక సీటుకు పోటీ పడుతున్నారు.
టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించింది బీసీలకు రెండు, ఎస్సీ మహిళకు ఒక సీటు కేటాయించింది. నెల్లూరు జిల్లాకు చెందిన బీద రవిచంద్రయాదవ్, అనంతపురానికి చెందిన బీటి నాయుడు, శ్రీకాకుళం జిల్లాకు చెందిన కావలి గ్రీష్మకు ఎమ్మెల్సీ అవకాశం కల్పించారు. వారు ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు.