ఎస్ఎల్‌బీసీ సొరంగం కూలిన ప్రాంతంలో 8 మంది సిబ్బంది చిక్కుకుపోయి రెండు వారాలు అవుతున్నా మృతదేహాలను బయటకు తీసుకురాలేని పరిస్థితుల నుంచి కొంత పురోగతి లభించింది. కేరళ నుంచి తెప్పించిన రెండు జాగిలాలు టన్నెల్‌లో డీ 2 వద్ద మృతదేహాలను గుర్తించాయి. ఓ కార్మికుడి చేయిని జాగిలం కనుగొంది. వెంటనే అక్కడ జాగ్రత్తగా తవ్వకాలు చేపట్టారు. ఇవాళ రెంు మృతదేహాలను వెలికితీసే అవకాశముంది.
సొరంగంలో మృతిచెందిన 8 మంది మృతదేహాలను వెలికితీసేందుకు 15 ఏజన్సీలకు చెందిన 360 మంది మూడు షిప్టుల్లో పనిచేస్తున్నారు. చాలా సంక్లిష్టమైన పరిస్థితులు నెలకొనడంతో మృతదేహాలను వెలికితీయడం ఆలస్యమైంది. ఒకవైపు బురద, భారీగా ఉబికి వస్తోన్న నీటితో పనులకు ఆటంకం ఏర్పడుతోందని అధికారులు చెబుతున్నారు. మరో నాలుగు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి కావచ్చని అంచనా వేస్తున్నారు.