ఒంటిమిట్టలో తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీఆర్ నాయుడు పర్యటించారు. శ్రీరామ నవమి వస్తున్న నేపథ్యంలో అక్కడ జరుగుతున్న ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఏప్రిల్ 5 నుంచి 15వ తేదీ వరకు ఒంటిమిట్ట రాముల వారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయని వివరించిన బీఆర్ నాయుడు, ఏప్రిల్ 11న సీతారాముల కల్యాణం ఉంటుందని తెలిపారు.

బ్రహ్మోత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టువస్త్రాలు, ముత్యాలు, తలంబ్రాలుఅందజేస్తారని వివరించారు. సీతారాముల కల్యాణోత్సవానికి వచ్చే భక్తులకు ముత్యాల తలంబ్రాలు అందజేస్తామని ఆర్ నాయుడు తెలిపారు.
ఏప్రిల్ 6న శ్రీరామనవమి , పోతన జయంతి, ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ప్రిల్ 9న హనుమంత వాహనం, ఏప్రిల్ 10న గరుడవాహనం, ఏప్రిల్ 11న శ్రీసీతారాముల కల్యాణం, ఏప్రిల్ 12న రథోత్సవం నిర్వహించనున్నారు.
పురాణాల ప్రకారం …. శ్రీమహావిష్ణువు త్రేతాయుగంలో శ్రీరామచంద్రునిగా అవతరించి మానవాళిని అనుగ్రహించాడు. సీతాలక్ష్మణ సమేతుడై దండకారణ్యంలో సంచరిస్తూ సీతాదేవి దప్పిక తీర్చేందుకు భూమిలోనికి బాణం వేయగా నీరు బుగ్గ పుట్టింది. అదే ఒంటిమిట్ట రామతీర్థంగా ప్రసిద్ధి కెక్కింది.