విశాఖ నగరంలో ఓ ఎన్‌ఆర్ఐ మహిళ అనుమానాస్పదంగా చనిపోవడం కలకలం రేపింది. ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని ఓ లాడ్జిలో మహిళ ప్రాణాలు కోల్పోయింది. గురువారం ఘటన జరిగినా శనివారం వరకు పోలీసులు విషయాన్ని గోప్యంగా ఉంచడంపై పలు అనుమానాలు వస్తున్నాయి.
శ్రీధర్ అనే డాక్టర్ నెల రోజుల కిందట ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఓ హోటల్లో గది బుక్ చేశాడు. తరవాత అతనికి పరిచయం ఉన్న మహిళ అమెరికా నుంచి వచ్చింది. నగరంలోని ఓ ప్లాంట్ అమ్మే విషయంలో వారి మధ్య గొడవలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. మహిళ బాత్ రూంలో ఉరేసుకుని చనిపోయింది డాక్టర్ శ్రీధర్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు అది ఆత్మహత్య కాదని తేల్చారు. దీంతో ఆ మహిళ అనారోగ్యంతో చనిపోయిందని శ్రీధర్ మాటమార్చాడు. ఆమె చనిపోవడానికి ముందు డాక్టర్ శ్రీధర్‌తో వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. మహిళ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి ఆమె భర్తకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.