అమెరికాలో మరోసారి కార్చిచ్చు అంటుకుంది. న్యూయార్క్‌లోని హోంప్టన్ ప్రాంతంలో ఈ కార్చిచ్చు చెలరేగింది. ఒకేసారి నాలుగు వేర్వేరు ప్రాంతాల్లో మంటలు వ్యాపించాయి. అతి కష్టం మీద మూడు ప్రాంతాల్లో మంటలను ఫైర్ ఫైటర్స్ అదుపులోకి తీసుకువచ్చారు. వెస్ట్ హోంప్టన్ ప్రాంతంలో 50 శాతం మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. మంటలకు కారణాలు తెలియరాలేదు. కార్చిచ్చుకు రెండు వాణిజ్య భవనాలు కాలిపోయాయి. న్యూయార్క్‌లో అత్యవసర పరిస్థితి విధించారు.
కరోలినా కార్చిచ్చుకు కారణమైన మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు.అలెగ్జాండ్రా బ్రిలెలౌసా అనే 40 సంవత్సరాల మహిళ కావాలనే నిప్పు పెట్టినట్లు గుర్తించారు. దక్షిణ కరోలినాలోని కోవింగ్టన్ లేక్స్ సబ్ డివిజన్ ప్రాంతంలో ఓ చెట్టుకు అలెగ్జాండ్రా నిప్పు పెట్టినట్లు అంగీకరించింది. మొదట ఆమె మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా అదుపులోకి రాలేదని వెల్లడించింది. అప్పటికే వాకర్ వుడ్స్ చెట్లకు మంటలు అంటుకున్నాయని తెలిపింది. మిర్టిల్ బీచ్ సమీపంలో ఇళ్లకు మంటలు వ్యాపించాయని అధికారులకు వెల్లడించింది.
దక్షిన కరోలినా ప్రాంతంలో పొడి వాతావరణం నెలకొనడంతో మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయి. ఇప్పటికే 4 వేల ఎకరాల్లో అడవులు తగలబడిపోయాయి. 50 శాతం మంటలను అదుపులోకి తీసుకువచ్చానా, ఇంకా ప్రమాదం పొంచి ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.