ఛాంపియన్స్ ట్రోఫీ -2025లో భాగంగా దుబాయ్ వేదికగా భారత్, న్యూజీలాండ్ మధ్య ఫైనల్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో కివీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. భారత్ వరుసగా 15వ సారి టాస్ కోల్పోయింది.
మార్పులేమీ లేకుండానే సెమీ ఫైనల్ జట్టుతో భారత్ ఫైనల్ ఆడుతోంది. న్యూజీలాండ్ కు మాత్రం ఒక మార్పు తప్పలేదు. గాయం కారణంగా మ్యాచ్ కు హెన్రీ దూరం కావడంతో నాథన్ స్మిత్ కు అవకాశం లభించింది.
వరుసగా అత్యధిక వన్డేల్లో టాస్ కోల్పోయిన కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డు కెక్కాడు. గతంలో బ్రియన్ లారా12 సార్లు పీటర్ బోరెన్ 11 సార్లు టాస్ కోల్పోయారు.
కివీస్ ఓపెనర్లు రచిన్ రవీంద్ర, విల్ యంగ్ ఇన్నింగ్ ప్రారంభించగా భారత బౌలర్ షమీ తొలి ఓవర్ వేశాడు. మూడు ఓవర్లు ముగిసే సరికి ఇద్దరు కలిసి పది పరుగులు రాబట్టారు.