పాకిస్తాన్ కు వీలైనంత వరకు వెళ్లకపోవడమే మంచిదని అమెరికా పౌరులకు అడ్వైజరీ జారీ చేసింది. పాకిస్తాన్ లో ఉగ్రదాడులు జరిగే ప్రమాదం ఎక్కువగా ఉందన్న అమెరికా భారత సరిహద్దు ప్రాంతాలైన , బలూచిస్థాన్, ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్స్ లకు అస్సలు వెళ్లొద్దని అడ్వైజరీలో హెచ్చరించింది.
కొన్ని ప్రాంతాల్లో పౌరులను లక్ష్యంగా ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని తెలిపింది. నియంత్రణ రేఖ వెంట ఉగ్రవాద కార్యకలాపాలతోపాటు సైనిక ఘర్షణలు జరిగే అవకాశముందని వివరించింది.
మార్కెట్లు, రద్దీ రవాణా కేంద్రాలు వద్ద పౌరులు, పోలీసులు, సైనికుల లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉందని చెప్పింది. లైన్ ఆఫ్ కంట్రోల్ ప్రాంతంలో అస్సలు ప్రయాణించవద్దని లెవెల్ 4 హెచ్చరికలు జారీ చేసింది.
పాకిస్తాన్ నుంచి భారత్ లో అడుగుపెట్టేందుకు ఉన్న ఏకైక అధికారిక మార్గం వాఘా బార్డర్ మాత్రమేనని, సరిహద్దులు దాటి భారత్ లో అడుగుపెట్టాలంటే వీసా తప్పనిసరి అని పేర్కొంది. ముందు వీసా తీసుకున్నాకే బార్డర్ వద్దకు వెళ్లాలని, వాఘా బార్డర్ వద్ద వీసా పొందే అవకాశం లేదని వివరించింది