హౌరా ఎక్స్ప్రెస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. రైలు పట్టాలు విరిగి ఉండటాన్ని గమనించిన సునీల్ అనే వ్యక్తి ఎర్ర గుడ్డతో లోకో ఫైలెన్ను అప్రమత్తం చేశారు. దీంతో రైలును వెంటనే లోకో ఫైలెన్ నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన గూడూరు సమీపంలో అడవయ్య కాలనీ వద్ద చోటు చేసుకుంది. విషయం తెలియగానే అధికారులు పట్టాలు విరిగిన ప్రాంతానికి చేరుకుని మరమ్మతులు చేయించారు. గంటసేపు రైలు నిలిచిపోయింది. రైలు పట్టా విరిగిన ఘటనపై విచారణకు ఆదేశించారు. కుట్ర కోణం లోనూ రైల్వే పోలీసులు విచారణ చేపట్టారు. ఇటీవల రైలు పట్టాలపై గ్యాస్ సిలిండర్లు, కరెంటు స్థంబాలు గుర్తించడంతో పెను ప్రమాదాలు తప్పిన సంగతి తెలిసిందే