అమెరికాలోని కాలిఫోర్నియాలో హిందూ ఆలయంపై దాడి జరిగింది. కాలిఫోర్నియా చినోహిల్స్ ప్రాంతంలోని స్వామి నారాయణ్ మందిర్‌పై కొందరు దుండగులు పెయింటింగ్‌తో విషపు రాతలు రాశారు. ఈ విషయాన్ని దేవాలయ నిర్వాహకులు ఎక్స్ వేదికగా వెల్లడించారు. దీనిపై భారత్ స్పందించింది. దాడులను ఖండించింది.
భారత్ విదేశాంగ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ ఈ దాడిపై ఓ ప్రకటన విడుదల చేశారు. చినోహిల్స్ ప్రాంతంలో దేవాలయంపై దాడి విషయం తమ దృష్టికి వచ్చింది. ఇలాంటి దాడులను ఖండిస్తున్నాం. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులను కోరుతున్నట్లు జైస్వాల్ తెలిపారు. గత ఏడాది సెప్టెంబరులోనూ ఇలాంటి దాడులు చోటు చేసుకున్నాయి.