సిరియాలో హింస చెలరేగింది. సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ మద్దతుదారులు, భద్రతా దళాల మధ్య హింస చెలరేగింది. తాజా హింసలో 1000 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. సిరియాలో అంతర్యుద్ధం మొదలైన తరవాత రెండు రోజుల్లో ఇంత మంది ప్రాణాలు కోల్పోవడం ఇదే మొదటి సారి.
ముందుగా అసద్ మద్దతుదారులు భద్రతా దళాలపై కాల్పులకు దిగినట్లు బ్రిటన్ సంస్థ వెల్లడించింది. తాజా హింసలో 745 మంది పౌరులు, 125 మంది భద్రతా సిబ్బంది, 130 మంది అసద్ మద్దతుదారులు మృతి చెందినట్లు బ్రిటన్ సంస్థ ప్రకటించింది. లటికాయ నగరం సమీపంలో అలావైట్లు మంచినీరు, విద్యుత్ సరఫరాలను అడ్డుకున్నారు.
సిరియాలో తిరుగుబాటుదారులు ఇటీవల మెరుపు వేగంతో దాడులు చేస్తున్నారు. దీంతో అసద్ రష్యా పారిపోయాడు. ఆయన మద్దతుదారులు తాజాగా భద్రతాదళాలపై దాడులకు దిగాయి. అసద్ తెగకు చెందిన అలావైట్లు అధికంగా ఉండే ప్రాంతాల్లోకి భద్రతా దళాలు ప్రవేశించడంతో తిరుగుబాటు మొదలైంది. బనియాస్ పట్టణ వీధుల్లో మృతదేహాలు గుట్టలుగా పడిఉన్నాయని బ్రిటన్ సంస్థ ప్రకటించింది.