ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌కు గత తెల్లవారుజామున ఛాతి నొప్పి రావడంతో, ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఎయిమ్స్ కార్డయాలజీ విభాగాధిపతి డాక్టర్ రాజీవ్ నారంగ్ వైద్య సేవలు అందిస్తున్నారు. జగదీప్ ధన్‌ఖడ్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇవాళ మధ్యాహ్నం ఆయన ఆరోగ్యంపై బులెటన్ విడుదల చేయనున్నారు.
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ శనివారం తెల్లవారుజామున ఛాతి నొప్పితో బాధపడ్డారు. ఈ విషయం కుటుంబసభ్యులకు, సహాయకులకు చెప్పడంతో వెంటనే ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. వెంటనే పరీక్షలు నిర్వహించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఎలాంటి ప్రాణహాని లేదని డాక్టర్లు తెలిపారు.