విశాఖపట్నం పరిధిలోని చంద్రంపాలెం జడ్పీ హైస్కూల్ కు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి . ఈ స్కూల్లో విద్యార్థులు, ఉపాధ్యాయుల సంఖ్య మిగతా బడులతో పోల్చుకుంటే చాలా ఎక్కువ. ఈ స్కూల్లో ప్రవేశాల కోసం పోటీ ఎక్కువగా ఉంటుంది.
మరో విశేషమేమంటే ఇక్కడ 116 మంది ఉపాధ్యాయులు పాఠాలు చెబుతుండగా అందులో మూడోవంతు మంది పంతులమ్మలే ఉన్నారు. అంటే 71 మంది ఉపాధ్యాయినులు పిల్లలకు పాఠాలు బోధిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలోనూ ఇంత మంది మహిళలు ఒకేచోట ఉండటం చాలా ప్రత్యేక విషయం.
స్కూల్‌లో వీరి కోసం ప్రత్యేక స్టాఫ్ రూం సదుపాయం కల్పించారు. ఒకరిని స్టాఫ్ సెక్రటరీగా ఎన్నుకుని తమ సమస్యలను ప్రధానోపాధ్యాయుడితో చర్చించి సమన్వయం చేసుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు.